నువ్వు నేను
మాట్లాడుకోని రోజు వస్తే ఏమవుతుంది...
ఏమవుతుంది ...
నువ్వు నన్ను మాటలేమి అనవు
నేను నిన్ను అసలు ఏమీ అనలేను...
ఎదురుపడితే
తప్పుకుపోవాలని నువ్వు అనుకోవు
తప్పించుకపోవాలని నేను అనుకోను
ఓ పొదుపైన బిగువు గీత
ఆ వైపు నీవు .. ఈ వైపు నేను
లేదంటే ఒకే వైపు దూరదూరంగా
తెలియని లెక్కలా
తెలపలేని లెక్కలా....
ఏదేమైనా....
జాలువారుతూనే ఉంటుందిగా
అనంత నిశ్శబ్ద ప్రణయగీతం
అంతుచిక్కని అంతర్వాహినిలా
ఓయ్... ఏమంటావ్